భారతదేశం, ఏప్రిల్ 20 -- ఆంధ్రప్రదేశ్‌లో గత ప్రభుత్వ హయాంలో మద్యం పాలసీతో కుంభకోణం జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో ప్రస్తుత ప్రభుత్వం ఈ ఇష్యూపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఆ సిట్ ముమ్మరంగా దర్యాప్తు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే.. గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన విజయసాయి రెడ్డి, ప్రస్తుత రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిని.. సిట్ అధికారులు ప్రశ్నించారు. అయితే.. అసలు సిట్ అధికారులు ఏమని ప్రశ్నించారు.. మిథున్ ఏం సమాధానాలు చెప్పారనే చర్చ ఇప్పుడు ఏపీలో జరుగుతోంది.

సిట్‌ ప్రశ్న- 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక తీసుకొచ్చిన నూతన మద్యం విధానం రూపకల్పనలో మీరే ప్రధాన పాత్ర వహించారా.. ఏ హోదాలో ఇందులో భాగస్వాములయ్యారు.. మీకేంటి సంబంధం?

మిథున్‌ సమాధానం- మద్యం విధానం రూపకల్పనలో నా పాత్ర అస్సలు లేదు. నేను అసలు అందులో భాగస్వామినే కాదు. దీని గ...