Hyderabad, జూన్ 15 -- గ్రహాలు కాలానుగుణంగా ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. ఈ సమయంలో 12 రాశుల వారిపై ప్రభావం పడుతుంది. కొన్ని కొన్ని సార్లు కొన్ని రాశుల వారికి అదృష్ట ఫలితాలు ఉంటాయి, మరికొన్ని సార్లు సమస్యలు వస్తాయి.

జూన్ 15 అంటే ఈరోజు సూర్యుడు మిధున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, సూర్యుడు సంచారం అనేక మార్పులను తీసుకువస్తుంది. సూర్యుడు శక్తివంతమైన గ్రహం. సూర్యుడు మానవుని శక్తి, కాంతి, జీవితం, సంకల్పశక్తి, అధికారం, ఆత్మను సూచిస్తాడు.

ఈ గ్రహం ప్రతి నెలా స్థానాన్ని మారుస్తుంది. ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటుంది. జూన్ నెలలో సూర్యుడు తన రాశిని మార్చుకుంటాడు. జూన్ 15న అంటే ఈరోజే వృషభ రాశి నుంచి మిధున రాశిలోకి ప్రయాణం చేస్తాడు.

వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, సూర్యుడు బలం, అధికారం, జీవితం, ఆ...