భారతదేశం, జూలై 8 -- భారతదేశంలో మిడ్‌రేంజ్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ల మార్కెట్ తీవ్ర పోటీతో దూసుకుపోతోంది. బ్రాండ్‌లు పనితీరు, డిస్‌ప్లే నాణ్యత, బ్యాటరీ లైఫ్​లో సరిహద్దులను దాటుతున్నాయి. ఇటీవల, పోకో- ఐక్యూ రూ. 35,000 లోపు ధరల విభాగంలో లేటెస్ట్​ గ్యాడ్జెట్స్​ని తీసుకొచ్చాయి. అవి.. పోకో ఎఫ్7 5జీ , ఐక్యూ నియో 10. ఈ రెండింటినీ పోల్చి ఏది బెస్ట్​? ఏది వాల్యూ ఫర్​ మనీ? వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

పోకో ఎఫ్7 పెద్ద 6.83-ఇంచ్​ అమోఎల్​ఈడీ స్క్రీన్‌ను 120హెచ్​జెడ్​ రిఫ్రెష్ రేట్, 1.5కే రెజల్యూషన్‌తో కలిగి ఉంది. ఇది 3200 నిట్‌ వరకు పీక్​ బ్రైట్​నెస్​ చేరుకోగలదు. ఇది ప్రకాశవంతమైన పరిస్థితులలో వినియోగదారులకు స్పష్టమైన దృశ్యమానతను అందిస్తుంది.

మరోవైపు, ఐక్యూ నియో 10 కొద్దిగా చిన్నదైన 6.78-ఇంచ్​ అమోఎల్​ఈడీ డిస్‌ప్లేను కలిగి ఉంది. అయితే ఇది వేగవంతమై...