భారతదేశం, సెప్టెంబర్ 27 -- మారుతీ సుజుకీ స్విఫ్ట్ భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో ఒకటి! మరీ ముఖ్యంగా మిడిల్​ క్లాస్​ కుటుంబాల్లో దీనికి మంచి డిమాండ్​ ఉంది. తాజాగా, కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ జీఎస్టీ ప్రయోజనాలను వినియోగదారులకు అందించడానికి స్విఫ్ట్ ధరను ఏకంగా రూ. 85,000 వరకు తగ్గించింది. దీనితో ఈ హ్యాచ్‌బ్యాక్ మరింత సరసమైనదిగా మారింది. ఈ ధర తగ్గింపుతో పాటు పండుగ ఆఫర్లు, ఇతర ప్రయోజనాలు కూడా తోడై ఈ పండుగ సీజన్‌లో మారుతీ సుజుకీ స్విఫ్ట్ అమ్మకాల ప్రదర్శనను గణనీయంగా పెంచుతాయని భావిస్తున్నారు.

ఆసక్తికరంగా మారుతీ సుజుకీకి చెందిన ఇతర హ్యాచ్‌బ్యాక్‌లైన ఆల్టో కే10, సెలెరియో, వ్యాగన్ఆర్, ఎస్-ప్రెస్సో వంటి వాటిలో అత్యధిక జీఎస్టీ ధర తగ్గింపు బేస్ వేరియంట్‌లలో లభించింది. అయితే స్విఫ్ట్ విషయంలో మాత్రం అత్యధిక ధర తగ్గింపు జెడ్​ఎక్స్​ఐ, జ...