Hyderabad, సెప్టెంబర్ 28 -- పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఓజాస్ గంభీరగా గర్జించిన సినిమా ఓజీ. సుజీత్ దర్శకత్వంలో డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తోంది.

తమన్ సంగీతం అందించిన ఓజీ సినిమా సెప్టెంబర్ 25న థియేటర్లలో విడుదలైంది. అభిమానుల నుంచి ఓజీ మూవీకి బ్లాక్ బస్టర్ టాక్ వస్తోంది. ఈ నేపథ్యంలో ఓజీ సక్సెస్ పేరుతో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన నిర్మాత నాగవంశీ ఓజీ మూవీ, పవన్ కల్యాణ్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. అవి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ.. "తమన్, నవీన్‌తో మేము ఎక్కువగా సినిమాలు చేస్తుంటాం. అలాగే నిర్మాతగా కళ్యాణ్ ఇంతటి భారీ సినిమా చేశాడు. అందుకే టీంకి అభినందనలు తెలపడం కోసం ఇక్కడికి వచ్చాను. ఈ సిన...