Hyderabad, జూన్ 15 -- బేబి మూవీతో నిర్మాతగా మంచి పేరు తెచ్చుకున్నారు టాలీవుడ్ ప్రొడ్యూసర్ ఎస్‌కేఎన్. ఇటీవల జరిగిన చిత్ర మండలి మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్‌కు అతిథిగా హాజరయ్యారు నిర్మాత ఎస్‌కేఎన్. ఈ చిత్ర మండలి సినిమాను బన్నీ వాస్ నూతన నిర్మాణ సంస్థ బి.వి. వర్క్స్ సమర్పణలో సప్త అశ్వ మీడియా వర్క్స్, వైరా ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించింది.

ప్రియదర్శి, రాగ్ మయూర్, విష్ణు ఓయ్, ప్రసాద్ బెహరా, నిహారిక ఎమ్ ప్రధాన పాత్రలు పోషించిన చిత్ర మండలి సినిమాక విజయేందర్ ఎస్ దర్శకత్వం వహించారు. అయితే, రీసెంట్‌గా చిత్ర మండలి టీజర్ లాంచ్‌కు సినీ ప్రముఖులు హాజరయ్యారు. వారితోపాటు అతిథిగా హాజరైన ప్రొడ్యూసర్ ఎస్‌కేఎన్ నిర్మాత అల్లు అరవింద్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

నిర్మాత ఎస్.కె.ఎన్ మాట్లాడుతూ.. "ఏ హోమం చేసినా మనం ముందుగా వినాయకుడికి పూజ చేస్తాం. మా ...