భారతదేశం, జనవరి 2 -- టాలీవుడ్ ప్రొడ్యూసర్ నాగవంశీ ఎప్పుడు మాట్లాడినా ఏదో ఒక కామెంట్ ప్రముఖంగా వార్తల్లో నిలుస్తుంది. తాజాగా ఐడిల్‌బ్రెయిన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ తమ సినిమాను తొక్కేయొద్దు అంటూ అతడు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం సంక్రాంతికి నవీన్ పోలిశెట్టితో కలిసి అతడు తీసిన అనగనగా ఒక రాజు మూవీ రిలీజ్ కు అతడు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే.

టాలీవుడ్ ప్రముఖ ప్రొడ్యూసర్లలో ఒకడైన నాగవంశీ తాజాగా తన నెక్ట్స్ మూవీ అనగనగా ఒక రాజు ప్రమోషన్లలో భాగంగా ఐడిల్‌బ్రెయిన్ కు ఓ ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులో మూవీ ఫెయిలవడంలో ఎవరిది తప్పు అని యాంకర్ అడిగినప్పుడు అతడు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

"చాలా వరకు తప్పు మా దగ్గరే అంటే ప్రొడక్షన్ లో ఉన్నప్పుడే జరుగుతాయి. కానీ కొన్ని ఫిఫ్టీ ఫిఫ్టీ సినిమాలు ఉంటాయి కదా.. వాటిని తొక్కేయొద్దు అని మీడియాను అ...