భారతదేశం, డిసెంబర్ 10 -- బాలీవుడ్ స్టార్ కపుల్ అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ విడిపోతున్నారనే వార్తలు గత కొంతకాలంగా ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. సోషల్ మీడియాలో దీనిపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. అయితే ఈ గొడవలన్నీ తమ కూతురు ఆరాధ్య బచ్చన్ దృష్టికి వెళ్లాయా? ఆమె వీటిని ఎలా చూస్తోంది? అనే ప్రశ్నలకు అభిషేక్ బచ్చన్ తాజాగా 'పీపింగ్ మూన్' ఇంటర్వ్యూలో సమాధానమిచ్చాడు.

అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ విడాకుల పుకార్లు ఇప్పటివి కావు. గత రెండేళ్లుగా వార్తల్లో ఉంటూ వస్తున్నాయి. వీటిపైనే తాజాగా మరోసారి అభిషేక్ స్పందించాడు. మీ విడాకుల వార్తల గురించి ఆరాధ్యకు తెలుసా అని అడిగినప్పుడు.. అభిషేక్ ఆసక్తికరమైన విషయాలు చెప్పాడు.

"ఆమెకు ఆ వార్తలు తెలియవని అనుకుంటున్నాను. ఆరాధ్య చాలా మెచ్యూర్డ్ అమ్మాయి. ఐశ్వర్య ఆమెను చాలా అద్భుతంగా పెంచింది. ఆరాధ్యకు ఈ విషయాలపై...