భారతదేశం, జనవరి 4 -- తెలంగాణ నీటి హక్కులకు భంగం కలగకుండా వ్యూహాత్మకంగా కొట్లాడి ఒక స్పష్టమైన ఎత్తుగడ ప్రకారం ప్రాజెక్టులను పూర్తి చేయాలన్న సంకల్పంతో పని చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. తెలంగాణ రైతులు, నీటి హక్కులు, ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో మా చిత్తశుద్ధి, నిజాయితీ, నిబద్ధతను ఎవరూ శంకించాల్సిన అవసరం లేదని అన్నారు.

పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి తొలి విడతగా 45 టీఎంసీలు, రెండో విడతగా 45 టీఎంసీలు అనుమతించాల్సిందేనన్నారు. లేదంటే జూరాల నుంచి నేరుగా నీటి తరలిస్తామని హెచ్చరించారు. ఏ సమస్యకైనా చర్చల ద్వారా పరిష్కారం సాధించవచ్చని, వివాదాలపై పక్క రాష్ట్రంతో చర్చల ద్వారా వివిధ హోదాల్లో కమిటీలను వేసుకుని సమస్యలను పరిష్కరించుకోవాలని ప్రయత్నిస్తున్నామని అన్నారు.

"నీళ్లు - నిజాలు" అన్న అంశంపై శాసనసభలో జరిగిన స్వల్పకాలిక చ...