Hyderabad, మే 2 -- ముంబైలో వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ (వేవ్స్) 2025 జరుగుతున్న విషయం తెలుసు కదా. అందులో ఎంతో మంది తెలుగు హీరోలు ఇప్పటికే పాల్గొన్నారు. తాజాగా శుక్రవారం (మే 2) ఇందులోని ప్యానెల్ పాన్ ఇండియా సినిమా: అపోహ లేదా ఓ ఊపు అనే సబ్జెక్ట్ పై మాట్లాడాడు. ఇందులో అక్కినేని నాగార్జున కూడా పాల్గొన్నాడు. అనుపమ్ ఖేర్, ఖుష్బూ సుందర్, కార్తీలాంటి వాళ్లతో కలిసి అతడు మాట్లాడాడు.

ఈ సందర్భంగా మన ఇండియన్ మాస్ హీరోలను నాగార్జున మార్వెల్, డీసీ సూపర్ హీరోలైన సూపర్ మ్యాన్, ఐరన్ మ్యాన్ లాంటి వాళ్లతో పోల్చాడు. ఇండియన్ సినిమా స్టోరీటెల్లింగ్ ప్రత్యేకమైనది, దీనిపై అందరూ గర్వించాలని అతడు అన్నాడు.

"ఓ హీరో తన పిడికిలి ఎత్తితే 20 మంది గాల్లోకి ఎగిరి పడతారు. అది అసహజంగా అనిపించవచ్చు. కానీ మార్వెల్ లేదా డీసీ సినిమాలు చూడండి.. సూపర్ మ్యాన్...