భారతదేశం, జనవరి 5 -- తెలుగులో ఇప్పుడిప్పుడే హీరోయిన్‌గా మంచి క్రేజ్ సంపాదించుకుంటోంది బ్యూటిపుల్ ముద్దుగుమ్మ పాయల్ రాధాకృష్ణ. అలా నిన్ను చేరి, ప్రసన్నవదనం, చౌర్యపాఠం వంటి సినిమాలతో ఆకట్టుకున్న పాయల్ రాధాకృష్ణ హీరోయిన్‌గా నటించిన లేటెస్ట్ మూవీ మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్.

యంగ్ హీరో త్రిగుణ్‌తో పాయల్ రాధాకృష్ణ జోడీ కట్టిన మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ సినిమాకు మధుదీప చెలికాని కథ, దర్శకత్వం వహించారు. అరవింద్ మండెం నిర్మించిన మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ టీజర్‌ను ఇటీవల విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ టీజర్ లాంచ్ ఈవెంట్‌లో ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకుంది హీరోయిన్ పాయల్ రాధాకృష్ణ.

పాయల్ రాధాకృష్ణ మాట్లాడుతూ.. "ఇది నేను ఫస్ట్ సైన్ చేసిన ఫిల్మ్. కానీ, పూర్తవ్వడానికి ఈ టైమ్ పట్టింది. ఈ ప్రాజెక్ట్ నాకు చాలా స్పెషల్. కథ చెప్పిన...