భారతదేశం, డిసెంబర్ 28 -- టీమిండియా క్రికెటర్ దీపక్ చహర్ అక్క, ఇటీవల ముగిసిన 'బిగ్ బాస్ 19' (Bigg Boss 19) కంటెస్టెంట్ మాలతీ చహర్ తన చిన్ననాటి చేదు జ్ఞాపకాలను పంచుకుంది. తన తల్లిదండ్రులు ఎప్పుడూ గొడవపడేవారని, ఆ కోపాన్ని తన మీద చూపించి కొట్టేవారని సిద్దార్థ్ కన్నన్ ఇంటర్వ్యూలో వెల్లడించింది.

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ, రీసెంట్‌గా బిగ్ బాస్ ద్వారా పాపులర్ అయిన మాలతీ చహర్.. తన గ్లామరస్ లైఫ్ వెనుక ఉన్న కన్నీటి కథను బయటపెట్టింది. ఈమె టీమిండియా క్రికెటర్ దీపక్ చహర్ అక్క కావడం గమనార్హం. మాలతీ చెప్పిన విషయాలు విని ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.

"మా ఇంట్లో ఎప్పుడూ టెన్షన్ ఉండేది. అమ్మానాన్న నిత్యం గొడవ పడేవారు. మేం ఉండేది చిన్న 1 బీహెచ్‌కే ఇల్లు. వాళ్ళు గొడవ పడుతుంటే పారిపోవడానికి కూడా నాకు దారి ఉండేది కాదు. నేను పెద్దదాన్ని కాబట్టి అదంతా భరించా...