భారతదేశం, జనవరి 7 -- వరుణ్ ధావన్, సన్నీ డియోల్, దిల్జిత్ దోసాంజ్, అహాన్ శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ బోర్డర్ 2. 1997లో వచ్చిన బ్లాక్ బస్టర్ బోర్డర్ సినిమాకు ఇది సీక్వెల్. 1971 ఇండో-పాక్ యుద్ధం కథ చుట్టూ ఈ బోర్డర్ 2 సాగుతుంది. ఈ సినిమా రిలీజ్ డేట్ పై పాకిస్థాన్ ఫ్యాన్ ఓ ప్రశ్న అడిగాడు. దీనిపై స్టార్ హీరో వరుణ్ ధావన్ రిప్లే వైరల్ గా మారింది.

బోర్డర్ 2 మూవీ ప్రపంచవ్యాప్తంగా జనవరి 23న రిలీజ్ కానుంది. అయితే పాకిస్థాన్ లో రిలీజ్ గురించి ఆ దేశానికి చెందిన ఓ యూజర్ అడిగాడు. వరుణ్ మంగళవారం (జనవరి 6) తన ఎక్స్ హ్యాండిల్ (గతంలో ట్విట్టర్) అభిమానులతో ముచ్చటించాడు. పాకిస్థాన్ అభిమాని ప్రశ్నపై వరుణ్ ధావన్ స్పందించాడు. అభిమానుల ఇంటరాక్షన్ సందర్భంగా, అలీ హైదర్ మీరానీ అనే ఎక్స్ వినియోగదారు తన బయోలో తాను పాకిస్తాన్ లోని సింధ్ కు చెందినవాడినని పేర్కొ...