భారతదేశం, డిసెంబర్ 8 -- తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 భారత్ ఫ్యూచర్ సిటీలో ప్రారంభమైంది. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సమ్మిట్‌లో ఒక ప్రత్యేక ఆకర్శణ ఇంటరాక్టివ్ రోబోట్, ఇది అతిథులను స్వాగతించడమే కాకుండా సమ్మిట్ లక్ష్యాలను కూడా వివరించింది. హాజరైన వారిని ఆకట్టుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా రోబోట్ పలకరించింది.

ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి అనేక స్టాళ్లను పరిశీలించారు. సినీ నటుడు నాగార్జున ముఖ్యమంత్రితో పాటుగా ఉన్నారు. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే.శివకుమార్, ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డిలతో పాటు వివిధ రంగాలకు చెందిన అనేక మంది జాతీయ, అంతర్జాతీయ అతిథ...