Hyderabad, ఆగస్టు 9 -- యూట్యూబ్‌లో మై విలేజ్ షో సిరీస్ ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసింది. అందులోని బిగ్ బాస్ గంగవ్వతోపాటు అనిల్ గీలా ఎంతో పేరు తెచ్చుకున్నారు. పలు సినిమాల్లో నటుడిగా చేసిన అనిల్ గీలా ఓటీటీ వెబ్ సిరీస్‌తో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ వెబ్ సిరీసే మోతెవరి లవ్ స్టోరీ.

ఆగస్ట్ 8 నుంచి జీ5లో మోతెవరి లవ్ స్టోరీ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. రూరల్ బ్యాక్ డ్రాప్ లవ్ స్టోరీ కామెడీగా తెరకెక్కిన మోతెవరి లవ్ స్టోరీ ఓటీటీ రిలీజ్‌కు ముందు మెగా ప్రీవ్యూ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలోని మోతెవరి లవ్ స్టోరీలోని 4 ఎపిసోడ్స్‌ను ప్రదర్శించారు. ఈ సందర్భంగా హీరో అనిల్ గీలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

అనిల్ గీలా మాట్లాడుతూ .. "మా జర్నీ 8 ఏళ్ల క్రితం ప్రారంభమైంది. ఈ స్థాయికి వస్తామని నేను అయితే అనుకోలేదు. శ్రీకాంత్ అన్న చెప్పినట్టుగా వచ్చే పదేళ్ల...