Hyderabad, సెప్టెంబర్ 23 -- పుష్యం ఫిలిం మేకర్స్ బ్యానర్‌పై బెల్లం సుధా రెడ్డి సమర్పణలో తెరకెక్కిన సినిమా దేవగుడి. ఈ సినిమాకు బెల్లం రామకృష్ణ రెడ్డి రచనా, దర్శకత్వం వహించారు. అభినవ శౌర్య, నరసింహ, అనుశ్రీ ప్రధాన పాత్రలు పోషించిన దేవగుడి సినిమాకు షేక్ మదీన్ సంగీతం అందించారు.

లక్ష్మీకాంత్ కనికే డిఓపిగా పనిచేసిన దేవగుడి సినిమాను నాగిరెడ్డి ఎడిటింగ్ చేశారు. తాజాగా దేవగుడి మూవీ ఫస్ట్ లుక్ ఆంధ్రప్రదేశ్ విప్, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, మంత్రి మందిపల్లి రాంప్రసాద్ రెడ్డి చేతుల మీదుగా మీడియా సమక్షంలో లాంచ్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఈవెంట్‌లో పలువురు మాట్లాడారు.

దర్శక నిర్మాత బెల్లం రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. "అందరికీ నమస్కారం. మా చిత్ర ఫస్ట్ లుక్ లాంచ్ కార్యక్రమానికి వచ్చిన మీడియా మిత్రులకు, అతిథులకు అందరికీ ధన్యవాదాలు. పిలిచి...