భారతదేశం, జనవరి 8 -- మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ తెలుగు కామెడీ యాక్షన్ సినిమా మన శంకర వరప్రసాద్ గారు. హిట్ మెషిన్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఉత్సాహాన్ని మరింత పెంచుతూ విక్టరీ వెంకటేష్ కీలక పాత్రతో నటిస్తున్నారు.

షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మించిన ఈ సినిమాలో నయనతార హీరోయిన్‌గా చేసింది. శ్రీమతి అర్చన ఈ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. జనవరి 12న మన శంకర వరప్రసాద్ గారు సంక్రాంతి సందర్భంగా రిలీజ్ కానుంది.

ఈ క్రమంలో సినిమా ప్రమోషన్‌లు అద్భుతంగా జరుగుతున్నాయి. ట్రైలర్, పాటలు సినిమా పై అంచనాలను భారీగా పెంచాయి. ఈ నేపథ్యంలోనే మన శంకర వరప్రసాద్ గారు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను మేకర్స్ చాలా గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో ప్రభాస్, రవితేజ, శర్వానంద్, నవీన్ పోల...