Hyderabad, సెప్టెంబర్ 2 -- జాన్వీ కపూర్ తాను ఎదుర్కొన్న మీడియా కష్టాల గురించి చెప్పుకొచ్చింది. సెలబ్రిటీల కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళకి స్పాట్‌లైట్‌లో ఉండటం అంత ఈజీ కాదు. జాన్వీకి కూడా అలాంటి అనుభవాలే ఎదురయ్యాయి. ఒక రీసెంట్ ఇంటర్వ్యూలో వోగ్‌తో మాట్లాడుతూ.. జాన్వీ కపూర్ తన తల్లి శ్రీదేవి చనిపోయినప్పుడు ఫొటోగ్రాఫర్లు తనను ఎలా వెంబడించారో, కనీసం ఏడ్చే అవకాశం కూడా లేకుండా ఎలా చేశారో చెప్పుకొచ్చింది.

జాన్వీ కపూర్ సెలబ్రిటీ స్టేటస్ గురించి కామెంట్స్ చేస్తూ గతం, ప్రస్తుతం గురించి చెప్పుకొచ్చింది. తన చిన్నతనంలో సెలబ్రిటీలు తమ పిల్లలను మీడియాకు దూరంగా పెట్టేవారు కాదని, ఇప్పుడు మాత్రం తమ పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నారని జాన్వీ అభిప్రాయపడింది. ఇక శ్రీదేవి మరణం సమయంలో తాను ఎదుర్కొన్న చేతు అనుభవం గురించి చెప్పుకొచ్చింది.

తన తల్లి చనిపోయినప...