Hyderabad, ఆగస్టు 17 -- మణికాంత్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న సినిమా ఫైటర్ శివ. ఈ సినిమాతో ప్రభాస్ నిమ్మల దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఐరా బన్సాల్ హీరోయిన్‌గా చేస్తున్న ఈ సినిమాలో సునీల్, వికాస్ వశిష్ట కీలక పాత్రలు పోషించారు. తాజాగా ఫైటర్ శివ టీజర్‌ని నిర్మాత అశ్వనీదత్ రిలీజ్ చేశారు.

ఈ సందర్భంగా ఫైటర్ శివ టీజర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్, హీరో నందమూరి బాలకృష్ణపై దర్శకుడు ప్రభాస్ నిమ్మల ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం డైరెక్టర్ ప్రభాస్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

దర్శకుడు ప్రభాస్ నిమ్మల మాట్లాడుతూ .. "అశ్వనీదత్, సంపత్ నంది గారి వల్లే ఈ 'ఫైటర్ శివ' ఇక్కడి వరకు వచ్చింది. మా మూవీ పోస్టర్‌ను సంపత్ నంది గారు, టీజర్‌ను అశ్వనీదత్ గారు రిలీజ్ చేసినందుకు థాంక్స్" అని చెప్పారు...