Hyderabad, జూన్ 9 -- టాలీవుడ్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ మూవీ 'కన్నప్ప' విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాలో మంచు విష్ణు, మంచు మోహన్ బాబు, ప్రీతి ముకుందన్, అక్షయ్ కుమార్, ప్రభాస్, మోహన్ లాల్, ముఖేష్ రిషి, కాజల్ అగర్వాల్ ముఖ్య పాత్రల్లో నటించారు.

అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకాలపై డా. మోహన్ బాబు నిర్మించిన ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. జూన్ 27వ తేదీన కన్నప్ప సినిమా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో జూన్ 7న గుంటూరులో ఘనంగా కన్నప్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో మోహన్ బాబు ఇంట్రెస్టింగ్ విశేషాలు చెప్పారు.

డా. మోహన్ బాబు మాట్లాడుతూ .. "మా అమ్మకి పుట్టుకతో రెండు చెవులు వినిపించేవి కావు. అందరూ నా వాయిస్‌ని మెచ్చుకుంటుంటే ఆ మాటలు మా తల్లికి వినిపిస్తే ఎంత బాగుండేది అనుకునేవాడిని. ...