భారతదేశం, డిసెంబర్ 24 -- తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చాటిచెప్పిన సినిమా 'బాహుబలి'. పదేళ్ల క్రితం మొదలైన ఈ సంచలనం ఇప్పుడు సరికొత్త రూపంలో మన ముందుకు వస్తోంది. బాహుబలి మొదటి భాగం విడుదలై పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా దర్శకధీరుడు రాజమౌళి రెండు భాగాలను కలిపి 'బాహుబలి: ది ఎపిక్' (Baahubali: The Epic) పేరుతో ఒకే సినిమాగా రూపొందించిన సంగతి తెలిసిందే.

థియేటర్లలో రికార్డులు సృష్టించిన ఈ స్పెషల్ వెర్షన్ బాహుబలి ది ఎపిక్ ఓటీటీ తెరపై రచ్చ చేసేందుకు సిద్ధమైంది. అది కూడా మరికొన్ని గంటల్లోనే బాహుబలి ది ఎపిక్ ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ తన సబ్‌స్క్రైబర్స్‌కు భారీ క్రిస్మస్ గిఫ్ట్ ప్రకటించింది.

'బాహుబలి: ది ఎపిక్' వెర్షన్‌ను డిసెంబర్ 25 (గురువారం) అర్థరాత్రి నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు అధికారికంగా వెల్లడ...