భారతదేశం, జనవరి 10 -- ఘట్టమనేని కుటుంబం నుంచి కొత్త తరం హీరో వచ్చేస్తున్నాడు. మహేష్ బాబు అన్న దివంగత రమేష్ బాబు కొడుకు జయ కృష్ణ ఘట్టమనేని హీరోగా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఘట్టమనేని జయ కృష్ణ డెబ్యూ మూవీ 'శ్రీనివాస మంగాపురం' నుంచి ఇవాళ హీరో ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. మహేష్ బాబు ఎక్స్ లో ఈ పోస్టర్ పంచుకున్నాడు.

మహేష్ బాబు అన్న కొడుకు జయకృష్ణ ఘట్టమనేని హీరోగా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. అతని ఫస్ట్ మూవీకి 'శ్రీనివాస మంగాపురం' అనే పేరు పెట్టారు. దీనికి అజయ్ భూపతి డైరెక్టర్. ఈ సినిమా నుంచి జయ కృష్ణ ఫస్ట్ లుక్ ను శనివారం (జనవరి 10) సూపర్ స్టార్ మహేష్ బాబు రిలీజ్ చేశారు. జయకృష్ణ మాస్ లుక్ అదిరిపోయిందనే కామెంట్లు వస్తున్నాయి.

శ్రీనివాస మంగాపురం నుంచి జయ కృష్ణ ఫస్ట్ లుక్ పోస్టర్ ను పంచుకుంటూ మూవీ టీమ్ కు మహేష్ బాబు ఆల్ ది బెస్ట్ చెప్పాడ...