భారతదేశం, జనవరి 11 -- రవితేజను అందరూ మాస్ మహారాజా అని ముద్దుగా పిలుచుకుంటారు. కానీ ఆ టైటిల్ ఇచ్చింది తానే అని డైరెక్టర్ హరీష్ శంకర్ చెప్పడం విశేషం. అంతేకాదు దానిని తీసేయాలంటే ముందు తనను అడగాలని అతడు అన్నాడు. భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ శనివారం (జనవరి 10) రాత్రి జరగగా.. దీనికి రవితేజ డైరెక్టర్లందరూ వచ్చారు.

రవితేజ ఈసారి సంక్రాంతికి భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే సినిమాతో వస్తున్న విషయం తెలుసు కదా. కిశోర్ తిరుమల డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా జనవరి 13న రిలీజ్ కానుండగా.. ప్రీరిలీజ్ ఈవెంట్ శనివారం (జనవరి 10) జరిగింది. ఈ ఈవెంట్ కు రవితేజను డైరెక్ట్ చేసిన డైరెక్టర్లందరూ రావడం విశేషం. వీళ్లలో హరీష్ శంకర్, బాబీ, శివ నిర్వాణలాంటి వాళ్లు ఉన్నారు.

ఈ సందర్భంగా హరీష్ శంకర్ ఇచ్చిన స్పీచ్ వైరల్ అవుతోంది. ఈ సినిమా కోసం మాస్ మహారాజా అనే ట...