భారతదేశం, నవంబర్ 18 -- మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బ పడింది. తాజాగా మావోయిస్టు అగ్రనేత హిడ్మాతోపాటుగా మరికొందరు ఎన్‌కౌంటర్‌లో మరణించారు. ఆయన భార్య, అనుచరులు కూడా మృతి చెందారు. ఛత్తీస్‌గడ్ సుక్మా- ఆంధ్రప్రదేశ్ అల్లూరి సీతారామరాజు జిల్లాల సరిహద్దుల్లో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.

ఉదయం 6 గంటల నుంచి ఏడు గంటల మధ్య ఎదురు కాల్పులు కొనసాగాయి. ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్‌లో ఆరుగురు మావోయిస్టుల మృతి చెందారు. అందులో మావోయిస్టు అగ్రనేత హిడ్మా కూడా ఉన్నారు. కూంబింగ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది.

భద్రతా దళాలు, పౌరులపై కనీసం 26 సాయుధ దాడులకు నాయకత్వం వహించిన పేరుమోసిన మావోయిస్టు నాయకుడు మడవి హిడ్మా హతమయ్యాడని అధికారులు కూడా ధృవీకరించారు. ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ రాష్ట్రాల ట్రై-జంక్షన్ సమీపంలో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. ఇక...