భారతదేశం, నవంబర్ 20 -- హిడ్మాతో సహా సీనియర్ మావోయిస్టులు ఏపీ ఎన్‌కౌంటర్లలో మరణించిన తర్వాత సీపీఐ (మావోయిస్ట్) చీఫ్ తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ ఎక్కడ ఉన్నారనే దానిపై ఊహాగానాలు తీవ్రమయ్యాయి. పోలీసులు అతడిని అరెస్ట్ చేయలేదని చెబుతున్నారు. అయితే తిప్పిరి తిరుపతి కుటుంబ సభ్యులు, ప్రజా సంఘాలు మాత్రం కస్టడీలో ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

మంగళవారం అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లిలో జరిగిన ఎన్‌కౌంటర్లలో పీఎల్‌జీఏ మొదటి బెటాలియన్ కమాండర్ హిడ్మా, అనేక మంది సీనియర్ మావోయిస్టులు చనిపోయారు. సుదీర్ఘ సౌయుధ పోరాటం హిడ్మా మరణంతో చివరి దశకు చేరుకుందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. అంతలా ప్రభావితం చేసే వ్యక్తిని కోల్పోయిన తర్వాత మావోయిస్టు పార్టీ మనుగడే ప్రశ్నార్థకంగా మారింది.

హిడ్మా మరణం తర్వాత మావోయిస్టు పార్టీ అగ్రనాయకులు ఉక్కిరి...