భారతదేశం, మే 21 -- ఛత్తీస్ గఢ్ లోని అబూజ్ మఢ్ అడవుల్లో భద్రతా దళాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో సీపీఐ (మావోయిస్టు) ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు హతమైనట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. ఛత్తీస్ గఢ్ లోని బస్తర్ ప్రాంతంలో బుధవారం భద్రతా దళాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో మరణించిన 27 మంది మావోయిస్టుల్లో బసవరాజు కూడా ఉన్నారని పోలీసులు తెలిపారు.

బసవరాజు మావోయిస్టు ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచారని అమిత్ షా అన్నారు. నక్సలిజాన్ని నిర్మూలించే పోరాటంలో బసవరాజు మరణం ఒక మైలురాయిగా హోం మంత్రి అభివర్ణించారు. ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ పూర్తయిన తర్వాత 54 మంది నక్సలైట్లను అరెస్టు చేశామని, ఛత్తీస్ గఢ్, తెలంగాణ, మహారాష్ట్రల్లో 84 మంది నక్సలైట్లు లొంగిపోయారని తెలిపారు. 2026 మార్చి 31 నాటికి నక్సలిజాన్ని నిర్మూలించాలని మోదీ ప్రభుత్వం కృతనిశ్చయ...