Hyderabad/Raipur, సెప్టెంబర్ 10 -- గత కొంతకాలంగా అగ్రనేతలను కోల్పోతున్న మావోయిస్టు పార్టీ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఓవైపు అనారోగ్య సమస్యలతో పాటు మరోవైపు భద్రతా బలగాలు చేస్తున్న దాడులను తట్టుకోలేకపోతోంది. ఈ క్రమంలోనే. ఛత్తీస్ గఢ్ లోని నారాయణపూర్ అడవుల్లో మే 21న జరిగిన దాడుల్లో పార్టీ చీఫ్ నంబాల కేశవరావు అలియాస్ బసవరాజ్ ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఈ స్థానం ఖాళీగా ఉండటంతో. పార్టీ నాయకత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.

పార్టీ కొత్త ప్రధాన కార్యదర్శిగా తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ బాధ్యతలు స్వీకరించినట్లు సమాచారం. ఈ బాధ్యతలను చేపట్టిన మూడో తెలుగు వ్యక్తిగా తిరుపతి ఉన్నారు. మరో కేంద్ర కమిటీ సభ్యుడు మాండ్వి హిడ్మాను. దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శిగా నియమించారు.

బస్తర్ లో మావోయిస్టు కార్యకలాపాలను పర్యవేక్షిస్తు...