భారతదేశం, నవంబర్ 26 -- ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో బుధవారం 41 మంది నక్సలైట్లు లొంగిపోయారు. ఇది ఛత్తీస్‌గఢ్‌లోని మావోయిస్టు పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ. బుధవారం బీజాపూర్ జిల్లాలో 41 మంది నక్సలైట్లు సీనియర్ పోలీసు అధికారుల ముందు లొంగిపోయారని అధికారులు నిర్ధారించారు. మొత్తం 32 మందిపై రూ.1.19 కోట్ల రివార్డు ఉంది. కొన్ని రోజులుగా వరుసగా మావోయిస్టులు లొంగుబాటు అవుతున్నారు.

ప్రభుత్వం తీసుకొచ్చిన లొంగుబాటు, పునరావాస విధానం తమను ఆకట్టుకుందని మావోయిస్టులు తెలిపారు. లొంగిపోయిన వారిలో 12 మంది మహిళలు ఉన్నారు. సీనియర్ పోలీసు అధికారుల ముందు 41 మంది లొంగిపోయారని బీజాపూర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జితేంద్ర కుమార్ యాదవ్ తెలిపారు.

41 మందిలో 39 మంది మావోయిస్టుల దక్షిణ సబ్-జోనల్ బ్యూరోలో భాగమని, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ, తెలంగాణ రాష్ట్ర కమిటీ, ధమ్...