Andhrapradesh, జూన్ 5 -- మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తలిగింది. ఎన్ కౌంటర్ లో పార్టీ అగ్రనేత సుధాకర్‌(అలియాస్ సింహాచలం) మృతి చెందాడు. కేంద్ర కమిటీ సభ్యుడుగా ఉన్న సుధాకర్ పై రూ.50 లక్షల రివార్డు ఉంది. సుధాకర్ స్వస్థలం ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరం.

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలోని నేషనల్ పార్క్ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో మావోయిస్టుల క్యాడర్ ఉన్నట్లు నిఘా సమాచారం మేరకు సైనిక దళాల ఆపరేషన్ చేపట్టాయి. మావోయిస్టులు, ఉమ్మడి దళాల మధ్య ఉదయం నుంచి ఎదురుకాల్పులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు జరిగిన ఎన్‌కౌంటర్‌లో సింహాచలం(65) ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ఈ ఎన్ కౌంటర్ కు సంబంధించి వివరాలు తెలియాల్సి ఉంది.

గత 40 ఏళ్లుగా మావోయిస్టు ఉద్యమంలో సుధాకర్ ఉన్నారు. 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో జరిపిన శాంతి చర్చల్లో ఆయన కూ...