భారతదేశం, జనవరి 13 -- మెగాస్టార్ చిరంజీవితో వాల్తేరు వీరయ్య వంటి సూపర్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన టాలీవుడ్ డైరెక్టర్ బాబీ కొల్లి అలియాస్ కేఎస్ రవీంద్ర. రవితేజ పవర్ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన బాబీ జూనియర్ ఎన్టీఆర్‌తో జై లవకుశ, వెంకీ మామ, సర్దార్ గబ్బర్ సింగ్ వంటి సినిమాలు తెరకెక్కించాడు.

అనంతరం చిరంజీవితో వాల్తేరు వీరయ్య, బాలకృష్ణతో డాకు మహారాజ్ మూవీస్ తీసి బ్లాక్ బస్టర్స్ అందుకున్నాడు డైరెక్టర్ బాబీ. అలాంటి బాబీ అతిథిగా భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరయ్యారు.

మాస్ మహారాజా రవితేజ, డింపుల్ హయాతి, ఆషిక రంగనాథ్ హీరో హీరోయిన్లుగా నటించిన భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాకు కిషోర్ తిరుమల దర్శకత్వం వహించారు. సంక్రాంతి సందర్భంగా ఇవాళ (జనవరి 13) థియేటర్లలో విడుదలైంది భర్త మహాశయులకు విజ్ఞప్తి.

కామెడీ టాక్ బాగా తెచ్చుకుంటోన్...