Hyderabad, సెప్టెంబర్ 5 -- సుహాస్ అంబాజీపేట మ్యారేజి బ్యాండు సినిమా హీరోయిన్ శివాని నాగరం నటించిన లేటెస్ట్ తెలుగు రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్ సినిమా లిటిల్ హార్ట్స్. ఈ సినిమాలో హీరోగా ఓటీటీ సిరీస్ 90స్ మిడిల్ క్లాస్ బయోపిక్ ఫేమ్ మౌళి తనూజ్ హీరోగా చేశాడు

ఈటీవీ విన్ ఓటీటీ ప్రొడక్షన్ నుంచి ఒరిజినల్ సినిమాగా వచ్చిన లిటిల్ హార్ట్స్ మూవీకి సాయి మార్తాండ్ దర్శకత్వం వహించారు. 90స్ మిడిల్ క్లాస్ బయోపిక్ డైరెక్టర్ ఆదిత్య హాసన్ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాను నిర్మాతలు బన్నీ వాస్, వంశీ నందిపాటి థియేట్రికల్ రిలీజ్ చేశారు.

సెప్టెంబర్ 5న అంటే ఇవాళ థియేటర్లలో విడుదల కానుంది లిటిల్ హార్ట్స్. ఈ నేపథ్యంలో రీసెంట్‌గా లిటిల్ హార్ట్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో హీరోయిన్ శివాని నాగరంతోపాటు పలువురు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు...