భారతదేశం, జూన్ 27 -- బిచ్చ‌గాడు ఫేమ్ విజ‌య్ ఆంటోనీ హీరోగా న‌టించిన లేటెస్ట్ మూవీ మార్గ‌న్. మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ సినిమాకు లియో జాన్ పాల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. విజ‌య్ ఆంటోనీ మేన‌ల్లుడు అజ‌య్ దిషాన్ ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించిన ఈ మూవీ శుక్ర‌వారం (జూన్ 27న‌) ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. ఈ థ్రిల్ల‌ర్ మూవీతో విజ‌య్ ఆంటోనీ తెలుగు ప్రేక్ష‌కుల‌ను మెప్పించాడా? లేదా? అంటే?

ధృవ కుమార్ అలియాస్ ధృవ (విజ‌య్ ఆంటోనీ) ఓ సిన్సియ‌ర్ పోలీస్ ఆఫీస‌ర్. ముంబాయిలో అడిష‌న‌ల్ డీజీపీగా ప‌నిచేస్తుంటాడు. త‌న తెలివితేట‌లు, ధైర్య‌సాహ‌సాల‌తో ఎన్నో క్లిష్ట‌మైన కేసుల‌ను ఈజీగా సాల్వ్ చేస్తాడు. హైద‌రాబాద్ సిటీలో ర‌మ్య అనే యువ‌తి దారుణంగా హ‌త్య‌కు గుర‌వుతుంది.

ఆమె డెడ్‌బాడీ మొత్తం న‌లుపు రంగులోకి మారుతుంది. ఆ హ‌త్య‌కు సంబంధించి పోలీసుల‌కు ఎలాంటి ఆధార...