భారతదేశం, అక్టోబర్ 23 -- స్టాక్ మార్కెట్ నేడు ఉదయం ఉత్సాహంతో ప్రారంభమైంది. గురువారం ఉదయం ట్రేడింగ్ ప్రారంభంలోనే దేశీయ బెంచ్‌మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ 50 భారీ లాభాలను నమోదు చేశాయి.

బీఎస్ఈ సెన్సెక్స్ 727.81 పాయింట్లు (0.86%) పెరిగి 85,154.15 వద్ద మొదలైంది. ఇక నిఫ్టీ 50 విషయానికి వస్తే, ఇది 188.60 పాయింట్లు (0.73%) పెరిగి కీలకమైన 26,057.20 మార్కు వద్ద ట్రేడింగ్ మొదలుపెట్టింది.

సాధారణంగా ఆసియా మార్కెట్లలో బలహీనత ఉంటే, దాని ప్రభావం మన మార్కెట్‌పై కూడా ఉంటుంది. అంతేకాకుండా, ముందు రోజు రాత్రి అమెరికా స్టాక్ మార్కెట్‌లో స్వల్ప పతనం కనిపించింది. అయినప్పటికీ, భారత స్టాక్ మార్కెట్ ఏకంగా పెరగడానికి ముఖ్య కారణం... భారతదేశం-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం త్వరలోనే ఖరారవుతుందనే వార్తలే. ఈ సానుకూల వాతావరణం అన్ని రంగాల్లో కొనుగోళ్లకు దారితీసింది.

స...