భారతదేశం, జనవరి 27 -- స్టాక్ మార్కెట్ కష్టాల్లో నడుస్తుండగా హైడెల్ బర్గ్ సిమెంట్ ఇండియా షేర్లు మాత్రం పెరిగి ఆశ్చర్యపరిచాయి. సోమవారం కంపెనీ షేర్ల క్రయవిక్రయాలు భారీగా జరిగాయి. బీఎస్‌‌ఈలో కంపెనీ షేరు రూ.219.20 స్థాయిలో ప్రారంభమైంది. ఇంట్రాడేలో కంపెనీ షేరు రూ.242 వద్ద గరిష్టాన్ని తాకింది. ఎన్ఎస్ఈ, బీఎస్ఈలో కంపెనీకి చెందిన 4.62 మిలియన్లకు పైగా షేర్లు ట్రేడయ్యాయి. ఇది ఫ్రీ ఫ్లోట్ ఈక్విటీలో 6.7 శాతానికి సమానం. మూడో త్రైమాసికం ముగిసేనాటికి కంపెనీలో మొత్తం ప్రమోటర్ల వాటా 69.39 శాతంగా ఉంది.

2024 అక్టోబర్ 7న బీఎస్ఈలో ఈ సిమెంట్ కంపెనీ షేరు ధర రూ.257.85 స్థాయికి చేరుకుంది. అంబుజా సిమెంట్ కంపెనీ ఇండియా వ్యాపారాన్ని కొనుగోలు చేయడానికి చర్చలు జరుపుతున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ఈ చర్చలను కంపెనీ అప్పట్లో ఖండించింది. ఇప్పుడు మరోసారి ఈ జర్మన్ ...