భారతదేశం, జూలై 14 -- వివో ఎక్స్ 200 ఎఫ్ఈ భారత మార్కెట్లో విడుదలైంది. ఇప్పటికే గ్లోబల్ మార్కెట్లోకి వచ్చిన ఈ డివైజ్ కెమెరా పరంగా బ్రహ్మాండంగా ఉంది. ఈ ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లో ఫ్లిప్‌కార్ట్ నుంచి కొనుగోలు చేయవచ్చు. లాంచ్ ఆఫర్ కింద బెనిఫిట్స్ పొందవచ్చు. ఈ ఫోన్ ఫీచర్లు, ధర, ఆఫర్ల గురించి తెలుసుకుందాం.

వివో ఎక్స్ 200 ఎఫ్ఈలో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తోపాటు 6.31 అంగుళాల అమోఎల్ఈడీ డిస్‌ప్లే, 1.5కే రిజల్యూషన్, 460నిట్స్ పిక్సెల్ డెన్సిటీ ఉన్నాయి. 6000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ, 90వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం వివో ఎక్స్ 200 ఎఫ్ఈలో 50 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ ఫ్రంట్ కెమెరా ఉంది.

ఫోన్ వెనుక ప్యానెల్‌లో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50 మెగాపిక్సెల్ జైస్ ఐఎంఎక్స్ 921 సెన్సార్ ఉంది. దీంతోపాటు 50 మెగాపిక్స...