భారతదేశం, జనవరి 30 -- భారతదేశంలోని ప్రీమియం ఎస్‌యూవీ (SUV) ప్రియుల కోసం ఫోక్స్‌వ్యాగన్ తన కొత్త అస్త్రాన్ని సిద్ధం చేసింది. తన లైనప్‌లో అత్యున్నత స్థానంలో నిలిచే 'టైరాన్ ఆర్ లైన్'ను కంపెనీ తాజాగా ఆవిష్కరించింది. ప్రస్తుతం ఉన్న టిగువాన్ (Tiguan) కంటే ఇది పరిమాణంలో పెద్దదిగా ఉండటమే కాకుండా, హై-ఎండ్ ఫీచర్లతో దేశీయ మార్కెట్లో బ్రాండ్ ఇమేజ్‌ను మరో స్థాయికి తీసుకెళ్లేలా కనిపిస్తోంది.

టైరాన్ ఆర్ లైన్ కేవలం లుక్స్‌లో మాత్రమే కాదు, పర్ఫార్మెన్స్‌లోనూ అదరగొట్టేలా ఉంది. ఇందులో 2.0-లీటర్ టిఎస్‌ఐ (TSI) టర్బో-పెట్రోల్ ఇంజిన్‌ను అమర్చారు. ఇది 200 బిహెచ్‌పి కంటే ఎక్కువ పవర్‌ను, 320 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 7-స్పీడ్ డిఎస్‌జి (DSG) ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చే ఈ కారులో ఫోక్స్‌వ్యాగన్ సిగ్నేచర్ '4MOTION' ఆల్-వీల్-డ్రైవ్ సిస్టమ్ ప్రామాణ...