భారతదేశం, నవంబర్ 18 -- మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బ పడింది. తాజాగా మావోయిస్టు అగ్రనేత హిడ్మాతోపాటుగా మరికొందరు ఎన్‌కౌంటర్‌లో మరణించారు. ఆయన భార్య, అనుచరులు కూడా మృతి చెందారు. ఆంధ్రప్రదేశ్ అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.

ఉదయం 6 గంటల నుంచి ఏడు గంటల మధ్య ఎదురు కాల్పులు మెుదలు అయ్యాయి. ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్‌లో ఆరుగురు మావోయిస్టుల మృతి చెందారు. అందులో మావోయిస్టు అగ్రనేత హిడ్మా కూడా ఉన్నారు. కూంబింగ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. మృతి చెందిన వారిలో హిడ్మా, అతడి భార్య రాజీ అలియాస్ రాజక్క, చెల్లూరి నారాయణ అలియాస్ సురేశ్, టెక్ శంకర్, మల్లా, దేవే ఉన్నారు.

భద్రతా దళాలు, పౌరులపై కనీసం 26 సాయుధ దాడులకు నాయకత్వం వహించిన పేరుమోసిన మావోయిస్టు నాయకుడు మడవి హిడ్మా హతమయ్యాడ...