భారతదేశం, డిసెంబర్ 6 -- అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లిలో మావోయిస్టు అగ్ర నేత హిడ్మాతోపాటుగా మరికొందరు ఎన్‌కౌంటర్ అయిన విషయం తెలిసిందే. అయితే ఉస్మానియా, కాకతీయ యునివర్సిటీ నుంచి విద్యార్థులు నిజనిర్ధారణకు వెళ్లారు. ఈ పర్యటన ఉద్రిక్తతకు దారితీసింది. విద్యార్థులను చింతూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాదాపు ఎనిమిది మంది విద్యార్థులను పోలీసులు ప్రశ్నించారని శనివారం ఒక అధికారి తెలిపారు. వారందరినీ తరువాత వెళ్ళడానికి అనుమతించారని అన్నారు.

'ఆపరేషన్ సంభవ్' కింద పోలీసులు రెండు రోజుల్లో 13 మంది మావోయిస్టులను అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లిలో కాల్చి చంపారు. నవంబర్ 18న ఆరుగురు, నవంబర్ 19న ఏడుగురు మరణించారు. 'విద్యార్థులను అదుపులోకి తీసుకోలేదు. శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు పరిశీలించారు.' అని అల్లూరి సీతారామరాజు జిల్లా...