భారతదేశం, సెప్టెంబర్ 30 -- కంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో కొత్తగా అడుగుపెట్టింది మారుతీ సుజుకీ విక్టోరిస్​. ఈ సెగ్మెంట్‌లో కియా సెల్టోస్.. 2019 నుంచే ప్రధాన పోటీదారుగా, విజయవంతంగా కొనసాగుతోంది. ఈ రెండు ఎస్‌యూవీలు అనేక ఇంజిన్ ఆప్షన్లు, ఫీచర్లతో నిండిన ఇంటీరియర్‌లు, పటిష్టమైన సేఫ్టీ ఫీచర్లను అందిస్తున్నాయి. రెండూ ఒకే విభాగంలో పోటీపడుతున్నప్పటికీ, వాటి ప్రాధాన్యతలు కాస్త భిన్నంగా ఉన్నాయి.

కొనుగోలుదారుల నిర్ణయాన్ని సులభతరం చేసేందుకు, ధర, సాంకేతిక వివరాలు, భద్రతా అంశాల్లో ఈ రెండు కార్లు ఎలా పోటీ పడుతున్నాయో ఇక్కడ చూద్దాం.

మారుతీ సుజుకీ విక్టోరిస్ దాదాపు ప్రతి ధర పాయింట్ వద్ద కియా సెల్టోస్ కంటే తక్కువకే లభిస్తోంది!

బేస్ వేరియంట్: విక్టోరిస్ బేస్ ట్రిమ్ దాదాపు రూ. 70,000 తక్కువ ధరతో ప్రారంభమవుతుంది.

మిడ్-వేరియంట్స్: మధ్యస్థ వేరియంట్‌ల ధరలు కూడా ...