భారతదేశం, జనవరి 30 -- మారుతి సుజుకి గ్రాండ్ విటారా, హ్యుందాయ్ క్రెటా ప్రస్తుతం భారతదేశంలో ఎక్కువగా అమ్ముడయ్యే ఎస్‌యూవీలు. ఈ రెండు కార్లలో ఏది బెస్ట్ అని పోల్చి చూస్తే ఈజీగా మీకు ఏం కొనాలో అర్థమవుతుంది. అందుకే ఈ రెండు ఎస్‌యూవీల ధర, ఫీచర్లు, మైలేజీ వివరాలను తెలుసుకుందాం.

మారుతి గ్రాండ్ విటారా ధరలు బేస్ పెట్రోల్ మాన్యువల్ వేరియంట్ కోసం రూ. 10.99 లక్షల నుండి మెుదలవుతాయి. టాప్ స్పెక్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఆటోమేటిక్(ఆల్ఫా ప్లస్) వేరియంట్ కోసం 20.99 లక్షలు ఖర్చు చేయాలి. సీఎన్జీ వేరియంట్లు రూ. 13.15 లక్షల ఎక్స్ షోరూమ్ నుండి మెుదలవుతాయి.

ఇక 2024 హ్యుందాయ్ క్రెటా బేస్ పెట్రోల్ మాన్యువల్ ధర రూ. 11 లక్షలు(ఎక్స్-షోరూమ్), టాప్ ఎండ్ టర్బో పెట్రోల్, డీజిల్ ఆటోమేటిక్ వేరియంట్‌ల ధర రూ. 20.15 లక్షలు(ఎక్స్-షోరూమ్). హ్యుందాయ్ క్రెటా నైట్ ఎడిషన్ ధర రూ.14.51 లక్...