భారతదేశం, నవంబర్ 11 -- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో పూర్తయ్యాయి. ఘట్‌కేసర్‌లోని ఎన్‌ఎఫ్‌సీ నగర్‌లో అశ్రు నయనాల మధ్య అంత్యక్రియలు జరిగాయి. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, ప్రజా సంఘాల నేతలు హాజరు అయ్యారు.
అందెశ్రీ పాడెను సీఎం రేవంత్ రెడ్డి మోశారు. మంత్రులు శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ హాజరు అయ్యారు. అశ్రు నయనాల మధ్య అంత్యక్రియలు నిర్వహించారు. పోలీసులు మూడుసార్లు గాలిలోకి కాల్పులు జరిపిన తర్వాత అంతిమ సంస్కారాలు జరిగాయి.
అంతకుముందు లాలాపేటలోని అందెశ్రీ నివాసం నుంచి తార్నాక, ఉప్పల్ మీదుగా ఘట్‌కేసర్ వరకు అంతిమయాత్ర జరిగింది. మాజీ ఎంపీలు హనుమంతరావు, సర్వే సత్యనారాయణ, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య విమలక్క పాల్గొని భౌతికకా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.