భారతదేశం, ఆగస్టు 3 -- రజనీకాంత్ నటించిన కూలీ ఈ ఏడాదిలో అత్యంత ఎదురుచూస్తున్న చిత్రాలలో ఒకటి. శనివారం చెన్నైలో చిత్ర బృందం భారీ ట్రైలర్ విడుదల కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ ట్రైలర్ అదరిపోయింది. యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. రజనీకాంత్ స్వాగ్ మరో లెవల్ లో ఉంది. ఇందులో విలన్ గా నాగార్జున లుక్ కూడా అదుర్స్ అనిపిస్తోంది. తన సినీ కెరీర్ లో నాగార్జున తొలిసారి విలన్ రోల్ చేయడం విశేషం.

కూలీ ట్రైలర్ తెగ వైరల్ గా మారింది. లోకేష్ కనగరాజ్ ఈ మూవీకి డైరెక్టర్. ఇందులో రజనీకాంత్, ఉపేంద్ర, నాగార్జున, ఆమీర్ ఖాన్ తదితరులు నటిస్తున్నారు. ఇందులో విలన్ గా నాగార్జున లుక్ అదిరిపోయింది. తన మామ మాస్ లుక్ కు కోడలు శోభిత ధూళిపాళ కూడా ఫిదా అయింది. అందుకే ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో తన మామ నాగార్జునపై ప్రశంసలు కురిపించింది. సినిమా తెలుగు ట్రైలర్‌ను పంచుకుంది.

ఆమె క్యాప...