భారతదేశం, జనవరి 13 -- సంక్రాంతి 2026 సందర్భంగా థియేటర్లలోకి వచ్చిన మన శంకర వరప్రసాద్ గారు సినిమాకు అన్ని వైపుల నుంచి బ్లాక్ బస్టర్ టాక్ వినిపిస్తోంది. సోమవారం (జనవరి 12) రిలీజైన ఈ మూవీకి పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి. మెగా కోడలు ఉపాసన కూడా తన మామయ్య చిరంజీవి సినిమాపై రివ్యూ ఇచ్చారు. మెగాస్టార్ యాక్టింగ్ కు ఫిదా అయ్యారు.

మన శంకర వరప్రసాద్ గారు సినిమాపై మెగాస్టార్ ఫ్యాన్స్, ఆడియన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. వింటేజీ లుక్ లో చిరంజీవి యాక్టింగ్ ఇరగదీశారని అంటున్నారు. చాలా కాలం తర్వాత చిరంజీవికి మంచి సినిమా పడిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చిరు కోడలు ఉపాసన కూడా మన శంకర వరప్రసాద్ గారకు మూవీకి ఇంప్రెస్ అయ్యారు. ఇది మెగా సంక్రాంతి అంటూ పోస్ట్ పెట్టారు. చిరు తనయుడు రామ్ చరణ్ భార్య ఉపాసన.

''ఇది మెగా సంక్రాంతి. హార్టీ కంగ్రాచ్యులేషన్స్ మామయ్య'...