Telangana,warangal, జూలై 26 -- వరంగల్ జిల్లాలోని మామునూరు ఎయిర్ పోర్టు నిర్మాణ పనుల్లో భాగంలో రాష్ట్ర సర్కార్ మరో ముందడుగు వేసింది. ఈ నిర్మాణ ప్రాజెక్టులో భాగంగా అవసరమైన భూసేకరణకు రూ.205 కోట్ల నిధులను విడుదల చేసింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులను జారీ చేసింది.

ఈ నిధులను ముఖ్యంగా భూసేకరణంతో పాటు ఇతర అనుమతుల కోసం ఖర్చు చేయనున్నారు. ఎయిర్‌పోర్టు పరిధిలో ఇప్పటికే 696 ఎకరాల భూమి ఉన్న సంగతి తెలిసిందే. అయితే బ్రౌన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టు అభివృద్ధిలో భాగంగా మరో 253 ఎకరాల భూమి కావాలని ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా కోరుతోంది. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం చాలా రోజులుగా కసరత్తు చేసింది. ఇందులో భాగంగా నక్కలపల్లి, గుంటూరుపల్లి, గాడిపల్లి గ్రామాలకు చెందిన 233 మంది రైతులకు సంబంధించిన భూములను గుర్తించింది.

అదనంగా కోరిన 253 ఎకరాల భూమిలో రన్‌వే విస్తరణ కో...