Andhrapradesh,chittor, జూలై 9 -- చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మార్కెట్‌ను వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ సందర్శించారు. మామిడి రైతులతో ముఖాముఖిగా మాట్లాడారు. గిట్టుబాటు ధరలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన. కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

"రైతుల జీవితాలను నాశనం చేయాలని కుట్ర చేస్తున్నారు. రైతులను కలవనివ్వకుండా ఆంక్షలు ఎందుకు పెడుతున్నారు? ప్రభుత్వమే రైతులపై కుట్ర చేయడం దారుణం. రైతులను రౌడీషీటర్లతో పోల్చుతారా?.. రైతు సమస్యలపై మాట్లాడితే భయమెందుకు?" అని వైఎస్ జగన్ నిలదీశారు,

"మామిడి రైతులు అవస్థలు పడుతున్నారు. వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతానని వేలమంది రైతులు ఇక్కడకు వచ్చి తమ ఆక్రందనను వినిపిస్తున్నారు. మా ప్రభుత్వ హయాంలో రైతులు మామిడిని రూ.22 నుంచి రూ.29 కి అమ్ముకున్నారు. ఏటా మామిడి కొనుగోలు మే నెలలో...