భారతదేశం, ఏప్రిల్ 16 -- ఉమ్మడి వరంగల్ జిల్లా మామిడి రైతులను అకాల వర్షాలు కోలుకోలేని దెబ్బ తీశాయి. మంగళవారం అర్ధరాత్రి వీచిన ఈదురుగాలులకు ఉమ్మడి జిల్లాలోని చాలా చోట్ల మామిడి కాయలు రాలిపోయాయి. పంట చేతికొచ్చే సమయంలో కాయలన్నీ నేలరాలడంతో అన్నదాతలు తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వందల ఎకరాల్లో మామిడి కాయలు నేలరాలగా.. అధికారులు పంట నష్టంపై వివరాలు సేకరించే పనిలో పడ్డారు.

మామిడి తోటలు ఉమ్మడి వరంగల్ జిల్లాలో దాదాపు 34 వేల ఎకరాల్లో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇందులో అత్యధికంగా మహబూబాబాద్ జిల్లాలోనే ఎక్కువ శాతం మామిడి తోటలు ఉన్నాయి. ఈ జిల్లాలో మొత్తంగా 14,560 ఎకరాల మేర మామిడి తోటలు ఉండగా, హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో 9,600, జనగామ జిల్లాలో 6,700, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 1,500, ములుగు జిల్లాలో 750 ఎకరాల పైగా మామిడి తో...