Hyderabad, మే 19 -- తీపి జ్యూసీ మామిడి పండ్లు చాలా రుచిగా ఉంటాయి. వేసవిలో వీటిని తినేందుకు ఎంతో మంది ఇష్టం చూపిస్తారు. మామిడిలో ఎన్నో రకాలు ఉన్నాయి. కొన్ని చాలా తీపిగా, నోట్లో పెడితేనే కరిగిపోయేలా ఉంటాయి. మామిడి పండును తినేటప్పుడు అందులో ఉండే గుజ్జును తిని టెంకలు లేదా పెద్ద విత్తనాలు బయట విసిరేస్తారు. నిజానికి పండు కన్నా ఈ విత్తనం వల్లే చాలా ప్రయోజనాలు ఉన్నాయి.

మామిడి టెంకలో రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి సహాయపడుతుంది. ఇది డయాబెటిస్ ఉన్నవారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది ఇన్సులిన్ సున్నితత్వాన్ని పెంచుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది.

మామిడి గింజల్లో ఉండే విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఇది శరీరం సంక్రమణతో పోరాడటానికి సహాయపడుతుంది. కాబట్టి మామిడి టెంకను పడేయకుండా ఉంచండి.

మామిడి టెంకలో కాలేయ...