భారతదేశం, ఫిబ్రవరి 15 -- అల్లు వారి ఇంట త్వరలోనే పెళ్లి బాజా మోగబోతుంది. అల్లు అరవింద్ చిన్న కొడుకు అల్లు శిరీష్ వివాహం త్వరలోనే జరగబోతోంది. ఈ నేపథ్యంలో పెళ్లి కార్యక్రమాలు ఊపందుకున్నాయి. శుభలేఖలతో పెళ్లికి ఆహ్వానం పలుకుతున్నారు. సంప్రదాయం ప్రకారం ముందుగా చిరంజీవి కుటుంబానికి వెడ్డింగ్ కార్డు ఇచ్చారు.

అల్లు అర్జున్ తమ్ముడైన అల్లు శిరీష్ పెళ్లికి ముందు కార్యక్రమాలు సందడిగా కొనసాగుతున్నాయి. రీసెంట్ గా పసుపు దంచుడు కార్యక్రమం నిర్వహించారు. ఇప్పుడు శుభలేఖలు పంచుతున్నారు. తెలుగు సంప్రదాయం ప్రకారం మొదటి శుభలేఖ మేనత్తకు ఇవ్వాలి. ఈ నేపథ్యంలోనే సురేఖ-చిరంజీవి దంపతులకు అల్లు అరవింద్ దంపతులు, అల్లు శిరీష్ కలిసి వెడ్డింగ్ కార్డు ఇచ్చారు. ఈ ఫొటోను అల్లు శిరీష్ తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో పోస్టు చేశాడు.

''తెలుగు సంప్రదాయం ప్రకారం తొలి శుభలేఖ మా మామయ్య...