భారతదేశం, ఆగస్టు 22 -- మెగాస్టార్.. ఇది జస్ట్ పేరో, బిరుదో కాదు. ఇది ఒక ఎమోషన్. కోట్లాది ఫ్యాన్స్ ను కదిలించే ఎమోషన్. థియేటర్లలో విజిల్స్ కొట్టించే ఎమోషన్. తెలుగు రాష్ట్రాల అభిమానులకు ఆరాధ్య దైవం. ఇవాళ (ఆగస్టు 22) చిరంజీవి 70వ పుట్టిన రోజు. చిరు బర్త్ డే విషెస్ చెప్తూ ఫ్యాన్స్, సెలబ్రిటీలు సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. ఇందులో మెగా హీరోలు కూడా ఉన్నారు. ముఖ్యంగా చిరు మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ పెట్టిన ఎమోషనల్ పోస్టు వైరల్ గా మారింది.

సాయి ధరమ్ తేజ్ చూడటానికి కాస్త చిరంజీవిలా కనిపిస్తాడు. చిరు సోదరి కొడుకే సాయి ధరమ్ తేజ్. తన మామయ్య చిరు అంటే అతనికి ఎంతో ఇష్టం. చాలా సందర్భాల్లో ఆ ఇష్టాన్ని బయటపెట్టాడు. ఇప్పుడు పుట్టిన రోజు నాడు ఎమోషనల్ పోస్టు పెట్టాడు. ఇది ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతోంది.

''నేను చూసిన మొదటి హీరో మా మామయ్య.. ఆయన జీవితం నా...