Hyderabad, ఫిబ్రవరి 13 -- రోజూ ఇంట్లోని ఫ్లోర్‌కు మాప్ పెట్టాల్సిందే. ప్రతిరోజూ మాప్ చేయడం వల్ల బ్యాక్టిరియా, వైరస్ వంటివి తొలగిపోతాయి. లేకుంటే అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి. మనం ఫ్లోర్ శుభ్రపరిచే ద్రావణాలు, డిటర్జెంట్లను వాడుతుంటాం. కానీ వీటిలో చాలా రకాల కెమికల్స్ ఉంటాయి. ఇవి శ్వాసకోశానికి హానికరం. మీ ఇంటిని బ్యాక్టీరియా లేకుండా, కెమికల్స్ లేకుండా శుభ్రం చేయాలనుకుంటున్నారా? ముఖ్యంగా చిన్న పిల్లలు ఉన్న ఇళ్లలో, పిల్లలు రోజంతా నేలమీద కూర్చుని ఆడుకుంటారు కాబట్టి వాడే లిక్విడ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంట్లో తయారు చేసే లిక్విడ్ తో మాప్ చేసుకుంటే రసాయనాలు సమస్య ఉండదు. పైగా దీన్ని చాలా తక్కువ ఖర్చుతో తయారుచేయవచ్చు. దీని వల్ల శుభ్రతతో పాటు బ్యాక్టిరియాలు కూడా దూరంగా ఉంటాయి.

కెమికల్స్ లేని నేల శుభ్రపరిచే ద్రావణాన్ని తయారు చేయాలనుకుంటున్...